కోవిడ్ తో అందరూ తెగ హైరానా పడుతున్నారు, ముఖ్యంగా సోషల్ డిస్టెన్స్ పాటించాలి అని ప్రభుత్వం కూడా చెబుతోంది, ఎవరైనా అవసరం ఉంటేనే బయటకు రావాలి అని చెబుతున్నారు.. ఇప్పటికే సినిమా పరిశ్రమకు చెందిన హీరోలు దర్శకులు నిర్మాతలు చాలా మంది కరోనా వైరస్ కట్డడికి ప్రభుత్వాలు చేస్తున్న కృషిని అభినందిస్తున్నారు.
ఈ సమయంలో పలువురు సీఎం సహయనిధికి విరాళాలు అందిస్తున్నారు..టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, పవన్‌కల్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్, నితిన్, త్రివిక్రమ్, దిల్ రాజు, సాయితేజ్, అల్లరి నరేష్ వంటి ప్రముఖులెందరో సాయం అందించారు.
తాజాగా ప్రభాస్ కూడా సాయం ప్రకటించారు.. యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ కరోనా నివారణ చర్యల నిమిత్తం రూ. కోటి రూపాయలు ప్రకటించారు. ఈ కోటి విరాళం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి ఇవ్వనున్నట్లుగా తెలిపారు, దీంతో మనసున్న మా రాజు మా ప్రభాస్ రాజు అంటున్నారు అభిమానులు.