రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్షన్లో క్రాక్ సినిమా విడుదల అయింది.. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది, ఇక డైలాగులు ఫైట్ ఇలా అన్నీ కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి చిత్రంలో… ఇక దర్శకుడికి కూడా మరిన్ని చిత్ర అవకాశాలు వస్తున్నాయి.. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఇప్పుడు మరో వార్త వినిపిస్తోంది.
తనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ను ఇవ్వకుండా నిర్మాత బి.మధు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తూ క్రాక్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకుల సంఘానికి ఫిర్యాదు చేశారు. నిర్మాత ఇంకా 12 లక్షలు దర్శకుడికి ఇవ్వాలట, దీనిని ఇంకా ఆయన క్లియర్ చేయలేదు అని ఫిర్యాదు చేశారు.
గోపీచంద్ ఫిర్యాదును స్వీకరించిన డైరెక్టర్స్ అసోసియేషన్.. వివాదాన్ని నిర్మాతల మండలి వద్దకు తీసుకెళ్లింది. దీనికి నిర్మాత సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.. అయితే నిర్మాత బి.మధు స్పందించారు. కమ్యూనికేషన్ లోపం వల్లే ఈ విషయం బయటకు వచ్చింది అని తెలిపారు,ఈ లాక్ డౌన్ వేళ సినిమా నిర్మించడానికి చాలా ఇబ్బంది పడ్డాను, కరోనా లాక్ డౌన్ తో బడ్జెట్ పెరిగింది దీనిని పరిష్కరిస్తాం అని తెలిపారు ఆయన.