పవన్ కల్యాణ్ హరీష్ శంకర్ సినిమాకి క్రేజీ టైటిల్ – వైరల్

Crazy title for Pawan Kalyan Harish Shankar movie

0
95

పవర్ స్టార్ పవన్కళ్యాణ్ వరుసగా సినిమాలు చేస్తున్నారు. వకీల్ సాబ్ తర్వాత ఆయన మరో మూడు సినిమాలు ఒకే చేశారు. పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సినిమా చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక వచ్చే ఏడాది ఈ సినిమా పట్టాలెక్కనుంది. అయితే ఓ టైటిల్ ఇప్పుడు వీరి పరిశీలనలో ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాకు హరీశ్ శంకర్ భవదీయుడు భగత్ సింగ్ అనే ఓ క్రేజీ టైటిల్ను పెట్టాలని అనుకుంటున్నారట. ఇక మరికొన్ని పేర్లు కూడా వైరల్ అవుతున్నాయి . అయితే తాజాగా ఈ పేరు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ టైటిల్ కు ఎవరైనా నో చెబితే భవదీయుడు అనే టైటిల్తో ముందుకెళ్లాలని భావిస్తున్నారట.

ఇక వీరి కాంబోలో గతంలో గబ్బర్ సింగ్ సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఈ సినిమాపై కూడా పవన్ ఫ్యాన్స్ ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు. కమర్షియల్ సినిమాలను తెరకెక్కించడంలో దిట్ట అయిన హరీశ్ శంకర్ ఈ చిత్రంతో మరో సూపర్ హిట్ కొట్టాలి అని చూస్తున్నారు. ఇప్పుడు పవన్ భీమ్లానాయక్ సినిమా చేస్తున్నారు. అలాగే హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నారు. తర్వాత ఈ చిత్రం సెట్స్ పైకి రానుంది.