KGF- 2 నుండి క్రేజీ అప్డేట్..తుఫాన్ లిరికల్ సాంగ్ వచ్చేసింది! (వీడియో)

0
100

రాకింగ్ స్టార్ యష్ నటించిన తాజా చిత్రం కెజిఎఫ్ 2. ఇప్పటికే సినీ ప్రపంచంలో ఓ ట్రెండ్‌ సెట్‌ చేసింది కేజీఎప్‌ -1. ఇప్పుడు కెజిఎఫ్ చాఫ్టర్ 2గా తెరకెక్కుతుంది. కాగా ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టింది చిత్ర యూనిట్.

తాజాగా ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్‌ వచ్చింది. ఈ మూవీ నుంచి తుఫాన్ అనే మొదటి లిరికల్ పాట విడుదలైంది. ఫస్ట్ పవర్ ఫుల్ డైలాగ్ తో మొదలైన ఈ సాంగ్ లో ప్రతి బీట్ పవర్ఫుల్ గా ఉంది.

ఈ సినిమాకు రవి బస్రు త్ సంగీతం అందించగా.. శ్రీకృష్ణ పృథ్వి చంద్ర, అరుణ తదితరులు పాడిన ఈ పాట కథానాయకుడి హీరోయిజాన్ని ఎలివేట్ చేసే మాస్ ట్రాక్ అని చెప్పవచ్చు. రామజోగయ్య శాస్త్రి దీనికి సాహిత్యం అందించారు.

వీడియో సాంగ్ చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి

https://www.youtube.com/watch?v=xUe3eR0n380