లైగర్ నుంచి క్రేజీ అప్టేట్..రొమాంటిక్‌ సాంగ్‌ ప్రోమో రిలీజ్‌ (వీడియో)

0
90

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా మూవీ లైగర్. ఈ సినిమాను డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తుండగా..అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.

మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో రౌడీ హీరో బాక్సర్ గా కనిపించనున్నట్లు తెలుస్తుంది. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నాడు. ‘లైగర్’ ఆగస్టు 25న విడుదలకానుంది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది టీమ్.

ఇప్పటికే చిత్రం నుంచి అదిరిపోయే మాస్ సాంగ్ AKDIPAKDI , ట్రైలర్ సెన్సేషన్ అయ్యాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి రొమాంటిక్‌ సాంగ్‌ ప్రోమో ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సాంగ్‌ లో విజయ్ దేవరకొండ, అనన్య చాలా అందంగా కనిపించారు. ఇద్దరి మధ్య రొమాంటిక్‌ సీన్స్‌ అదిరిపోయాయి. ఫుల్‌ సాంగ్‌ ను రేపు సాయంత్రం విడుదల చేయనున్నారు.

https://twitter.com/TheDeverakonda?