లైగర్ నుంచి క్రేజీ అప్టేట్..WAATLAGADENGE గ్లింప్స్‌ రిలీజ్- Video

0
90

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ సినిమాతో బిజీగా వున్నాడు. ఈ సినిమాను డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తుండగా..అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ‘లైగర్’ ఆగస్టు 25న విడుదలకానుంది.

మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో రౌడీ హీరో బాక్సర్ గా కనిపించనున్నట్లు తెలుస్తుంది. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నాడు. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది టీమ్.

ఇప్పటికే చిత్రం నుంచి అదిరిపోయే మాస్ సాంగ్ AKDIPAKDI , ట్రైలర్ సెన్సేషన్ అయ్యాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ‘వాట్‌ లగా దేంగే’ అంటూ సాగే గ్లింప్స్‌ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో విజయ్‌ దేవరకొండ నోట వాట్‌ లగా దేంగే అంటూ ఓ డైలాగ్‌ వస్తుంది. ఆ డైలాగే, ఈ వీడియోకు హైలెట్‌ గా నిలిచింది. ఈ వీడియో అందరీని బాగా ఆకట్టుకుంటోంది.

https://www.youtube.com/watch?v=C71xTnzGrbk&list=PLHuHXHyLu7BFx-n50vNkDo6z8EbVEIesX