‘ధాకడ్‌’ టీజర్‌కు విశేషమైన స్పందన

'ధాకడ్‌' టీజర్‌కు విశేషమైన స్పందన

0
80

బాలీవుడ్‌ ‘క్వీన్‌’ కంగనా రనౌత్‌ తన యాక్షన్‌తో ప్రేక్షకుల్ని మెప్పించేందుకు సిద్ధమయ్యారు. ‘జడ్జిమెంటల్‌ హై క్యా’ తర్వాత ఆమె నటిస్తున్న సినిమా ‘ధాకడ్‌’. రజనీష్‌ రాజి ఘాయ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఇందులో కంగన ఓ యాక్షన్‌ హీరోయిన్‌ అవతారంలో కనిపించి, మెప్పించారు. ఈ టీజర్‌కు యూట్యూబ్‌లో విశేషమైన స్పందన లభిస్తోంది. కంగన చేతిలో తుపాకీ, గాయాలతో చాలా డ్యాషింగ్‌గా ఉన్నారు. చివరిలో ఆమె చూసిన చూపు టీజర్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వచ్చే ఏడాది దీపావళికి ఈ చిత్రం విడుదల కాబోతోంది.

ఈ చిత్రం టీజర్‌ గురించి కంగన మాట్లాడుతూ.. ‘టీజర్‌లో మేం ఉపయోగించిన తుపాకీ నిజమైంది, అది చాలా బరువుగా ఉంటుంది. ఒక్కదాన్ని పైకెత్తాలంటే నా శక్తినంతా కూడగట్టుకునేదాన్ని. నేను ఆ తుపాకీలతో కష్టపడుతుంటే డైరెక్టర్‌ చూసి నవ్వుకునేవారు. ఇకనైనా డమ్మీ తుపాకీలతో షూటింగ్‌ చేయించాలని ఆశిస్తున్నా (నవ్వుతూ)’ అని చెప్పారు.