ఆర్ ఆర్ ఆర్ సినిమా నిర్మాత మరో సంచలన నిర్ణయం

ఆర్ ఆర్ ఆర్ సినిమా నిర్మాత మరో సంచలన నిర్ణయం

0
96

టాలీవుడ్ సినిమాల స్టామినా పెరిగింది.. బాలీవుడ్ రేంజ్ లో నిర్మాతలు సినిమాలు ప్లాన్ చేస్తున్నారు.. బాహుబలి, సాహో, సైరా ఇలా భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కాయి, తాజాగా దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా కేటగిరీలో ఆర్.ఆర్.ఆర్ చిత్రాన్ని నిర్మిస్తున్నామని ప్రకటించారు డి.వి.వి.దానయ్య.

ఈ సినిమాని దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నారు.. రామ్ చరణ్ తారక్ ఈ సినిమాలో నటిస్తున్నారు.ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుని జూలై 30 రిలీజ్ లక్ష్యంగా పెండింగ్ చిత్రీకరణను శరవేగంగా పూర్తి చేసుకుంటోంది ఈ చిత్రం.

తాజాగా ఈ సినిమా గురించి మరో అప్ డేట్ వస్తోంది. అయితే అనుకున్న దానికంటే బడ్జెట్ భారీగానే అవుతోదంట ఎక్కడా ప్రొడక్షన్ ఖర్చులు కట్స్ లేకుండా చేస్తున్నారట. అందుకే తాజాగా దానయ్య బృందం ఆర్కా మీడియాతో చేతులు కలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆర్కా అధినేతలతో ప్రస్తుతం డీల్ కి సంబంధించిన పలు అంశాల్ని డీవీవీ సంస్థ మాట్లాడుతోందట. దీంతో కాస్త పెట్టుబడి వారిది ఉంటుంది అని అంటున్నారు.. మరి ఏ సినిమా అయినా ఫైనాన్షియర్ల డీల్ ఉంటుంది.. సో అందుకే ఆయన ఈ తలనొప్పులు లేకుండా ఆర్కాతో చేతులు కలుపుతున్నారు అని తెలుస్తోంది.