దర్బార్ సినిమాకి బ్రేకులు షాక్ లో రజనీ ఫ్యాన్స్

దర్బార్ సినిమాకి బ్రేకులు షాక్ లో రజనీ ఫ్యాన్స్

0
143

రజనీకాంత్ ఈ ఏడాది దర్బార్ సినిమాతో సంక్రాంతికి మన ముందుకు వస్తున్నారు… ఇప్పటికే ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న చిత్ర యూనిట్ మరో రెండు రోజుల్లో సినిమా విడుదలకు పక్కా ప్లాన్స్ వేసుకుంది.. దర్బార్ సినిమా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్న విషయం తెలిసిందే.. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై ఈ మూవీని విడుదల చేస్తున్నారు.

తాజాగా ఈ సంస్థకు షాక్ తగిలింది. దర్బార్ మూవీని నిలిపివేయాలంటూ మలేషియాకు చెందిన డీఎమ్‌వై క్రియేషన్స్ సంస్థ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమ సంస్థకు లైకా ప్రొడక్షన్ సంస్థ రూ.23 కోట్లు బకాయిలు చెల్లించాలని, రోబో 2.0 దర్బార్ సినిమాలకు ఫైనాన్స్ ఇచ్చినట్లు పిటిషన్‌లో పేర్కొంది. దీంతో ఒక్కసారిగా ఈ సినిమా గురించి ఇప్పటి వరకూ వినిపించని వార్త తాజాగా వైరల్ అవుతోంది.

ఈ పిటిషన్‌ను విచారించిన మద్రాస్ హైకోర్టు దర్బార్ సినిమా విడుదల కావాలంటే డీఎమ్‌వై క్రియేషన్స్ సంస్థకు లైకా ప్రొడక్షన్స్ రూ. 4.90 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశించింది, దీనిపై నిర్మాతలు వారితో చర్చిస్తున్నారట, మురుగదాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే దీనిపై రజనీ అభిమానులు కచ్చితంగా సినిమా విడుదల చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు.