దర్బార్ సినిమా ఆఫర్ చెన్నైలో ఏం ఇస్తున్నారో చూస్తే మీరు వెళతారు

దర్బార్ సినిమా ఆఫర్ చెన్నైలో ఏం ఇస్తున్నారో చూస్తే మీరు వెళతారు

0
91

అబ్బా తమిళనాట సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా వస్తోంది అంటే అది అక్కడ సంక్రాంతి అనే చెప్పాలి… తలైవా సినిమా కోసం అభిమానులు అలా ఎదురుచూస్తారు, తాజాగా ఈ నెల 9న దర్బార్ చిత్రం రిలీజ్ కానుంది, ఇక తమ హీరో సినిమా వస్తోంది అని అభిమానులు పండుగ చేస్తున్నారు, విడుదలకు ముందే అన్నదానాలు చేస్తున్నారు కేకులు కట్ చేసి పంచిపెడుతున్నారు, పేదలకు బట్టలు పంచిపెడుతున్నారు.

అంతేకాదు కొందరు కంపెనీ ఓనర్లు సినిమా టికెట్లు కూడా మొత్తం ఆఫీసులో ఉద్యోగులకి అందిస్తున్నారు, అంతేకాదు
ప్రైవేటు ఆఫీసులవారు దర్బార్ రిలీజ్ రోజున సెలవును ప్రకటించారు. అయితే ఎక్కడా జరుగని విధంగా థియేటర్లపై హెలికాఫ్టర్ తో పూల వర్షం కురిపించడానికి అభిమానులు అనుమతులు తీసుకుంటున్నారు.

అంతేకాదు కాలేజీ స్కూల్స్ లో కాంపిటీషన్లు పెట్టి స్టూడెంట్స్ కు దర్బార్ సినిమా టికెట్స్ ఇస్తున్నారు, పలు షాపుల్లో మాల్స్ లో కాంటెస్టులు పెట్టి ఆఫర్లు పెట్టి సినిమా టికెట్స్ ఆఫర్ చేస్తున్నారు, నిజంగా చెన్నైలో అంతా దర్బార్ మహిమ కనిపిస్తోంది, కోలీవుడ్ నుంచి భారత్ అంతా ఈ సినిమా కోసం వెయిటింగ్.