దర్బార్ సరికొత్త అప్టేడ్ ఫ్యాన్స్ కు పండుగే

దర్బార్ సరికొత్త అప్టేడ్ ఫ్యాన్స్ కు పండుగే

0
89

రజనీకాంత్ కొత్త చిత్రం దర్బార్ ఆయన పుట్టిన రోజున ట్రైలర్ రిలీజ్ అవుతుంది అని అందరూ అనుకున్నారు.. కాని ఆరోజు ట్రైలర్ విడుదల చేయలేదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ సిద్దం అయింది అని తెలుస్తోంది. అది డేట్ కూడా వచ్చేసింది… ఈనెల 16 సోమవారం సాయంత్రం 6:30 నిమిషాలకు దర్బార్ ట్రైలర్ విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ దర్శకుడు మురుగదాస్ సోషల్ మీడియా వేదికగా తెలియాజేశారు.

మొత్తానికి తలైవా సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ట్రైలర్ ప్రీ పండుగ అనే చెప్పాలి.. ఆ తర్వాత ఆయన సినిమా చూసే ఛాన్స్ దక్కుతుంది అంటున్నారు అభిమానులు. ఇటీవల మరో సినిమాని కూడా ఫిక్స్ చేసుకున్నారు రజనీకాంత్. ఆ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లనుంది.

ఇక దర్బార్ విషయానికి వస్తే వచ్చే ఏడాది సంక్రాంతికి ఇది విడుదల కానుంది..ముంబై నేపథ్యంగా నడిచే మాఫియా స్టోరీనే దర్బార్ మూవీ ని
పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో రజిని కాంత్ కనిపిస్తున్నారు, అంతేకాను కనివిని ఎరుగని రీతిలో ఇందులో ఫైట్స్ ఉంటాయట మాఫియాకు చెమటలు పట్టించే ఆఫీసర్ గా రజనీ అదరగొట్టారు అని తెలుస్తోంది.. నయనతార రజిని సరసన హీరోయిన్ గా నటిస్తుంది. లైకా ప్రొడక్షన్స్ సినిమా నిర్మించారు.