డార్లింగ్ ప్రభాస్ మరో ఘనత..ఆ జాబితాలో నెంబర్ 1

Darling Prabhas is another achievement..No.1 in that list

0
115

బాహుబలి, సాహో లాంటి చిత్రాలతో పాన్ ఇండియా వ్యాప్తంగా ప్రభాస్ ఇప్పటికే అద్భుతమైన గుర్తింపు సంపాదించుకున్నారు. బాలీవుడ్ బడా హీరోలను కూడా తన మార్కెట్‌తో సవాల్ చేస్తున్నారు రెబల్ స్టార్. సౌత్ నుంచి నార్త్ వెళ్లి ఇప్పటికే ఎన్నో అద్భుతమైన.. ఎవరికీ సాధ్యం కాని రికార్డులు సృష్టించారు ప్రభాస్.

తాజాగా ప్రభాస్..మరో అరుదైన ఘనత సాధించాడు. బ్రిటన్ కు చెందిన ఈస్టర్న్-ఐ వీక్లీ విడుదల చేసిన 2021 దక్షిణాసియా ప్రముఖుల జాబితాలో ప్రభాస్ మొదటి స్థానంలో నిలిచాడు. సెలబ్రిటీస్ ఇన్ ది వరల్డ్ జాబితా..”ఈస్టర్న్ ఐ”లో ఇవాళ ప్రచురితం కానుంది. సినిమా, టీవీ, సాహిత్యం, సంగీతం, సోషల్ మీడియా ప్రపంచంలోని అనేకమంది గ్లోబల్ స్టార్ ల కంటే ప్రభాస్ ముందు వరుసలో నిలిచాడు. 2021లో విశేషంగా అభిమానులను ఆకర్షించిన 50 మంది ప్రముఖులతో..ఈస్టర్న్-ఐ జాబితా రూపొందించింది.

బ్రిటిష్ పాకిస్తానీ నటుడు రియాజ్ అహ్మద్ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ప్రియాంక చోప్రా మూడో స్థానం, ఇండియన్ అమెరికన్ మిండీ కాలింగ్ నాలుగు, సింగర్ శ్రేయా గోషల్ ఐదో స్థానంలో నిలిచారు. ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, స్పిరిట్ చిత్రాల్లో నటిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 14న రాధేశ్యామ్ విడుదల కానుంది.