Dasara OTT |ఇటీవల కాలంలో విడుదలై బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేశ్ ల ‘దసరా’ చిత్రం త్వరలోనే ఓటీటీ ప్లాట్ ఫాంలోకి రానుంది. నానికి ఇది తొలి పాన్ ఇండియా మూవీ కావడంతో పాటు రూ.100కోట్ల హీరోల లిస్టులో చేర్చింది. మార్చి 30న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను భారీ ధరతో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మే30న నెట్ ఫ్లిక్స్(Dasara OTT) లో ప్రసారం చేయాలని భావించినా.. ఇప్పుడు నెల ముందుగానే ఏప్రిల్ 27 నుంచే ప్రసారం చేయనున్నట్లు సమాచారం. దీనిపై అతి త్వరలోనే నెట్ ఫ్లిక్స్ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ సినిమాకు ఓదెల శ్రీకాంశ్ దర్శకత్వం వహించగా.. సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. కాగా ప్రస్తుతం నాని తన 30వ చిత్రంతో బిజీగా ఉన్నాడు. తండ్రి కూతురు నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోన్న ఈ చిత్రం 2023 డిసెంబర్ 21న విడుదల కానుంది.
Dasara OTT |నాని ‘దసరా’ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
-