మన దేశంలో చాలా చిత్ర సీమల్లో బయోపిక్ లు తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే రాజకీయ సినిమా ప్రముఖుల బయోపిక్స్ తెరపై దృశ్యాలుగా వచ్చాయి. ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు, మహానటి, యాత్ర, మల్లేశం ఇలాంటి చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. మరో లెజెండ్ బయోపిక్ ను తెరకెక్కించేందుకు టాలీవుడ్ రెడీ అవుతోంది.మరి ఆయన ఎవరో కాదు.
టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు, నిర్మాత దాసరి నారాయణరావు. ఎన్నో అద్భుత చిత్రాలతో ప్రత్యేకమైన గుర్తింపు పొందారు దర్శకరత్న దాసరి నారాయణరావు. ఇక ఆయన బయోపిక్ ధవళ సత్యం దర్శకత్వం వహించనున్నారు. ఇమేజ్ ఫిల్మ్స్ బ్యానర్లో తాడివాక రమేశ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాకి సంబంధించి స్టోరీపై వర్క్ జరుగుతోంది.
ఇక ఇందులో నటీనటుల ఎంపిక కూడా చేయనున్నారట. అంతేకాదు ఆయనకు ఉన్న బిరుదుతోనే ఈ సినిమా టైటిల్ ఉంటుంది అంటున్నారు. దర్శకరత్న అనే టైటిల్ దాదాపు ఖరారు అయింది అని తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలను మేకర్స్ ప్రకటించబోతున్నారు. 1972లో తాత మనవడు చిత్రంతో ఆయన దర్శకుడిగా మారారు. తెలుగు చిత్ర సీమలో 100 సినిమాలకు దర్శకత్వం వహించారు. 2017లో దాసరి అనారోగ్యంతో కన్నుమూశారు.