దసరాకి ఆ దర్శకుడితో వరుణ్ తేజ్ సినిమా ?

దసరాకి ఆ దర్శకుడితో వరుణ్ తేజ్ సినిమా ?

0
99

ప్రస్తుతం దర్శకుడు వెంకీ కుడుముల ఓ కథపై వర్క్ చేస్తున్నారు… ఈ స్టోరీ మెగా హీరో వరుణ్ తేజ్ కు వినిపించారు.. ఆయన కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట… అయితే ఇప్పుడు ఈ స్టోరీ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంది అంటే తాజాగా ఓ డేట్ వినిపిస్తోంది… అదే దసరా అని అంటున్నారు… ఈ సినిమాని దసరాకి స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట.

 

 

ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించడంలో దర్శకుడిగా వెంకీ కుడుముల మంచి మార్కులు కొట్టేశారు. ఛలో భీష్మ భారీ విజయాలను అందుకున్నాయి… ఇక తాజాగా మరో స్టోరీ ఇలాంటిదే రాసుకున్నారట… ఇది వరుణ్ కు బాగా నచ్చింది అని తెలుస్తోంది… ఇక కథ రెడీ అవ్వడంతో వరుణ్ డేట్స్ ఇస్తే తెరపైకి తీసుకురావడమే ఆలస్యం.

 

అయితే ప్రస్తుతం వరుణ్ ఎఫ్ 3 సినిమా చేస్తున్నారు…..ఇక తర్వాత గని కూడా ఫినిష్ చేసి ఈ సినిమాని సెట్స్ పై పెట్టాలి అని భావిస్తున్నారట..ఈ సినిమా షూటింగును దసరాకి మొదలుపెట్టాలనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. ఇక హ్యాట్రిక్ కోసం దర్శకుడు వెంకీ చూస్తున్నారట.. అయితే ఈ సినిమాకి కూడా రష్మికను తీసుకునే ఆలోచన చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది..