ఎఫ్‌-3 మూవీ ట్రైలర్‌ రిలీజ్ కు డేట్ ఫిక్స్..

0
122

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన లేటెస్ట్ మూవీ ఎఫ్ 3. ఈ సినిమాలో హీరోల సరసన తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటించారు. ఎఫ్ 2 పోయిన 2019 సంక్రాంతికి విడుదలైన ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది.

ఎఫ్ 2 మూవీ కి సీక్వెల్ గా ఈ సినిమాను అనిల్ రావిపూడి తెరెక్కిస్తున్నాడు. ఎఫ్2 మూవీలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ తమదైన శైలిలో నటించి భారీ విజయాన్ని సాధించారు. దాంతో ఎఫ్ 3 కూడా తీయాలని నిర్ణయించినుకొని ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఈ సినిమా మే 27వ తేదీన విడుదలై ధీయేటర్లలో సందడి చేయనుంది.

అయితే ఇటీవలే ఎఫ్ 3 మూవీ నుండి ఉ ఆ ఆహా ఆహా అంటూ సాగే హాట్ సాంగ్ ను విడుదల చేసి  ప్రేక్షకులను ఆనందపరిచారు.అయితే తాజాగా ఎఫ్ 3 మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసింది చిత్ర బృందం. ఈ సినిమా ట్రైలర్‌ మే 9 వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటిచింది.