నటుడు ప్రకాష్ రాజ్ ను చంపేందుకు డేట్ ఫిక్స్

నటుడు ప్రకాష్ రాజ్ ను చంపేందుకు డేట్ ఫిక్స్

0
93

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటుడు ప్రకాష్ రాజును ఈ నెల 29 హత మార్చుతామని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు లేఖ ద్వారా తెలిపారు… ప్రస్తుతం ఆ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది…

ప్రకాష్ రాజ్ తో పాటు మరో 13 మంది వివిధ రంగాలకు చెందిన నేతలను హత్య చేస్తామని హెచ్చరించారు.. అందులో మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి నిజగునానంద స్వామి పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది..

కన్నడ అక్షరాలతో ముద్రించిన ఈ లేఖలో ధర్మానికి దేశానికి ద్రోహం చేస్తున్న వారిని హతమార్చుతామని తెలిపారు… అందుకు 29 న ముహూర్తం నిర్ణయించామని అన్నారు… తమ అంతిమ ప్రయాణానికి సహకరించాలని ప్రజలను కోరినట్లు ఆ లేఖలో ఉంది… ఈ మేరకు తనను హత్య చేస్తామని బెదిరింపులు వచ్చాయని ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు కుమార స్వామి