హిందీలో కామ్రేడ్ రేటు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

హిందీ కామ్రేడ్ రేటు రూ.6 కోట్లు

0
86

విడుదలకి ముందే డియర్ కామ్రేడ్ హిందీ రిమేక్ పై ప్రకటన వచ్చేసిన సంగతి తెలిసిందే. డియర్ కామ్రేడ్ ని ముందే వీక్షించిన కరణ్ జోహార్ బాలీవుడ్ లో కామ్రేడ్ రిమేక్ చేయబోతున్నట్టు ప్రకటించేశారు. ఆ తర్వాత దీనిపై రకరకాల ప్రచారం జరిగింది. ఈ రిమేక్ లో ‘ధడక్’ పెయిర్ ఇషాన్-జాన్వీలు నటిస్తారనే వార్తలు వినిపించాయి. ఇప్పుడు బాలీవుడ్ కామ్రేడ్ పై మరికొన్ని వార్తలు బయటికొచ్చాయి. రూ. 6కోట్లతో డియర్ కామ్రేడ్ రిమేక్ రైట్స్ ని తీసుకొన్నారట కరణ్.

ఈ చిత్రాన్ని లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా మలచాలనే ప్లాన్ లో ఉన్నారట. #మీటూ కాన్సెప్టుతో ‘లేడీ కామ్రేడ్’ కథని రెడీ చేస్తున్నారంట. ఇప్పటికే కథపై కసరత్తు జరుగుతుందట. నిజానికి డియర్ కామ్రేడ్ విజయ్ దేవరకొండది కీలక పాత్రే. అయినా.. ఇది హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న కథే. ఇప్పుడీ కథని పూర్తిగా లేడీ ఓరియెటెండ్ కథగా మార్చబోతున్నారు కరణ్. అంటే లేడీ కామ్రేడ్ గా తీసుకురాబోతున్నారు.