డిసెంబర్ 6 న కల్యాణ్ రామ్ సందడి

డిసెంబర్ 6 న కల్యాణ్ రామ్ సందడి

0
92

సంక్రాంతి సినిమాల సందడి మొదలైంది, ఈసారి నందమూరి హీరో కూడా సందడి చేయనున్నాడు. సంక్రాంతికి వచ్చే ఏడాది సరిలేరునీకెవ్వరు, అలాగే అల వైకుంఠపురంలో ఈ రెండు సినిమాలు వస్తున్నాయి… ఈ సిమాలతో పోటీగా ఎంత మంచివాడవురా. కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా కూడా వస్తుంది.

ఇటీవల టీజర్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ అది మూణ్నాళ్ల ముచ్చటే అయింది. ఓ పక్క బన్నీ మహేష్ ప్రమోషన్స్ కోసం టీజర్లు స్టిల్స్ పాటలతో అదరగొడుతున్నారు, అంతేకాదు సినిమా పబ్లిసిటీ పీక్స్ కు వెళుతోంది. కాని కల్యాణ్ రామ్ ఇలా స్లో అవ్వడంపై నందమూరి అభిమానులు డల్ అయ్యారు.

అందుకే కల్యాణ్ రామ్ తాజాగా తను కూడా పబ్లిసిటీ పెంచాలి అని అనుకున్నాడు ఈ సినిమా పాటల్ని డిసెంబర్ 6 నుంచి విడుదల చేయాలని నిర్ణయించారు. అంతేకాదు మూవీ ప్రమోషన్స్ కూడా అదరగొట్టాలి అని చూస్తున్నాడు కల్యాణ్ రామ్.