సినిమా స్టార్లు ఈ కరోనా సమయంలో మొత్తం ఐదు నెలలుగా ఇంటి పట్టున ఉన్నారు.. ఒక్క షూటింగు జరగలేదు, దీంతో ఇచ్చిన డేట్స్ అన్నీ క్లోజ్ అయ్యాయి, మళ్లీ కొత్త డేట్స్ సెట్ చేసుకోవాలి, ఇక ఇతర దేశాల్లో అవుట్ డోర్ షూటింగులకి డేట్స్ ఇచ్చుకోవాలి. ఇది ఆయా నటుల మేనేజర్లకు పెద్ద తలనొప్పి అనే చెప్పాలి.
అయితే చాలా వరకూ షూటింగ్ పూర్తి అయిన సినిమాలకు డేట్స్ ముందు ఇస్తున్నారు, అయితే ఈ సమయంలో పలు యాడ్స్ కూడా చేస్తు ఉంటారు నటులు హీరోయిన్లు, ముఖ్యంగా హీరోయిన్లు అనేక యాడ్స్ నటిస్తూ ఉంటారు, ఇక బాలీవుడ్ లో దీపిక పదుకొణే పరిస్థితి కూడా అలాగే వుంది.
ఆమె చేతినిండా సినిమాలతో పాటు పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా ఉండటంతో ఐదు నెలలుగా ఒక్క యాడ్ షూట్ చేయలేదు, అయితే దాదాగా పది కంపెనీలు యాడ్స్ కోసం వెయిట్ చేస్తున్నాయి.
ఆమె పలు సినిమాలతో పాటు పలు ఉత్పత్తులకు ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది.
దీంతో వరుసగా మూడు రోజుల్లో ఈ పదియాడ్స్ ఫినిష్ చేయాలి అని ప్లాన్ చేస్తోంది, తర్వాత సినిమా షూటింగుకి ప్లాన్ చేస్తోంది, ఇప్పటీకే ఆమె మేనేజర్లు ఈ వర్క్ లో బిజీగా ఉన్నారట, మొత్తం పది యాడ్స్ ముంబైలో చిత్రీకరిస్తున్నారట, ఇక బాలీవుడ్ లో ఆమె ఎంత పాపులర్ హీరోయినో తెలిసిందే.