దీప్తి, షన్ను ఫ్యాన్స్‌కు శుభవార్త..సంచలన నిజాన్ని లీక్ చేసిన తండ్రి..ఆ ఇద్దరు మళ్లీ కలవనున్నారా?

Deepti, good news for Shannu fans..the father who leaked the sensational fact

0
84

దీప్తి సునైనా..షణ్ముఖ్ జస్వంత్.. ఈ పేర్లకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా వీళ్లిద్దరూ చాలా కాలంగా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఆరంభంలో ఎవరికి వాళ్లు వీడియోలు చేస్తూ వచ్చినా.. ఆ తర్వాత జంటగా మారారు. ఈ క్రమంలోనే ఎన్నో సిరీస్‌లు, డ్యాన్స్ వీడియోలు, ప్రైవేట్ ఆల్బమ్స్ వంటివి చేశారు. ఆ సమయంలోనే వీళ్లిద్దరూ ప్రేమలో కూడా పడిపోయారు. పెళ్లి కూడా చేసుకుంటారనే వార్తలు వచ్చాయి.

కానీ న్యూ ఇయర్ రోజు దీప్తి సునైనా సోషల్ మీడియా వేదికగా షణ్ముఖ్‌కు బ్రేకప్ చెప్పేసింది. ఈ మేరకు ఓ సుదీర్ఘమైన పోస్టును కూడా చేసింది. ‘చాలా ఆలోచనలు, చర్చల తర్వాత షన్నూ, నేనూ పరస్పరంగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇకపై ఇద్దరం వేరే వేరే దారుల్లో నడవబోతున్నాం’ అంటూ ప్రియుడికి భారీ షాక్ ఇచ్చిందామె.

అయితే ఈ విషయంపై షణ్ముఖ్ తండ్రి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. దీప్తి బ్రేకప్ చెప్పింది కానీ షణ్ముఖ్ చెప్పలేదు. వాళ్లిద్దరూ కలవడానికి కొంత సమయం పడుతుందేమో కానీ కలిసే ఉంటారు. వాళ్ళిద్దరి వ్యక్తిగత విషయాల మనం ఎక్కువగా చర్చించకూడదు అంతా శుభమే జరుగుతుంది అని అన్నారు.