షణ్ముఖ్‌కు బ్రేకప్‌ చెప్పిన దీప్తి సునయన..ఇన్‌స్టాలో భావోద్వేగ పోస్ట్

Deepti Sunayana says breakup to Shanmukh..Emotional post on Instagram

0
126
deepthi sunaina

యూట్యూబ్ స్టార్స్ షణ్ముఖ్‌ జశ్వంత్‌, దీప్తి సునయన బ్రేకప్‌ చెప్పుకోబోతున్నారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఇదే నిజమని తేల్చేసింది దీప్తి. కొత్త సంవత్సరానికి లవ్‌ బ్రేకప్‌తో స్వాగతం పలికింది. షణ్నుతో తన తెగదెంపుల గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ పోస్ట్‌ పెట్టింది.

“నా శ్రేయోభిలాషులు మరియు స్నేహితులందరికీ ఎంతో ఆలోచించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం. నేను, షణ్ముఖ్ పరస్పరం మా వ్యక్తిగత జీవితాలలో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఈ ఐదు సంవత్సరాలు మేము సంతోషంగా ఉన్నాం. మేమిద్దరం కలిసి ఉండేందుకు ప్రయత్నించాము. కానీ జీవితానికి అవసరమైన వాటిని విస్మరించాం. మా మార్గాలు వేరని తెలుసుకున్నాం. అందుకే మా దారులలో వెళ్లేందుకు ఇద్దరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ క్లిష్ట సమయంలో మీరు మాకు అండగా ఉండండి. అలాగే మా ప్రైవసీకి భంగం కలిగించరని కోరుకుంటున్నాం.” అంటూ సుదీర్ఘ పోస్ట్ చేసింది దీప్తి సునయన.

 

https://www.instagram.com/stories/deepthi_sunaina/?