బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర(Dharmendra)కు ఢిల్లీలోని పటియాలా కోర్టు నోటీసులు జారీ చేసింది. వారిపై దాఖలైన పిటిషన్‌కు కౌంటర్ వేయాలని కోర్టు సూచించింది. కాగా ధర్మేంద్ర తనను మోసం చేశాడంటూ ఓ వ్యాపారి ఫిర్యాదు చేశాడు. అతని పిటిషన్ విచారణలో భాగంగా ధర్మేంద్ర సహా మరో ఇద్దరికి ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది.
‘గరం ధరమ్ ధాబా’ ఫ్రాంఛైజీలో పెట్టుబడులు పెట్టించి తనను తప్పుదోవ పట్టించారని, దాని వల్ల తాను తీవ్రంగా నష్టపోయానంటూ ఢిల్లీ వ్యాపారవేత్త సుశీల్ కుమార్ ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదుపై విచారణ జరిపిన సందర్భంగా ధర్మేంద్రకు జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ యశ్‌దీప్ చాహన్ నోటీసులు జారీ చేశారు.
ఏప్రిల్ 2018లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని NH-24/NH-9లో ‘గరం ధరమ్ ధాబా’ ఫ్రాంఛైజీ ఇస్తామని ధర్మేంద్ర(Dharmendra) తనను సంప్రదించనట్లు సుశీల్ తెలిపారు. ఆయన మాటలు నమ్మి తాను రూ.63 లక్షల వరకు పెట్టుబడులు పెట్టినట్లు వివరించారు. ఢల్లీ, హర్యానా వంటి నగరాల్లో ఈ రెస్టారెంట్ బ్రాంచ్‌లు సుమారు రూ.70 నుంచి రూ.80 లక్షల టర్నోవర్‌ను అర్జిస్తున్నాయని ఆశ చూపడంతో తాను ఫ్రాంఛైజీలో పెట్టుబడులు పెట్టానని తెలిపారు.
ఈమేరకు ఒప్పంద పత్రాలపై సంతకాలు కూడా చేసినట్లు సుశీల్ వివరించారు. అంతా అయ్యాక ధర్మేంద్ర సైలెంట్ అయ్యారని, దాంతో తాను మోసపోయానని గ్రహించి కోర్టును ఆశ్రయించానని సుశీల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం తన ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదని, తనకు న్యాయం జరిపించాలని సుశీల్ కోరారు.