దేశంలో రికార్డ్ – మ‌రో అవార్డ్ ద‌క్కించుకున్న ప్ర‌భాస్

దేశంలో రికార్డ్ - మ‌రో అవార్డ్ ద‌క్కించుకున్న ప్ర‌భాస్

0
130

బాహుబ‌లి సినిమాతో ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌భాస్ కు మంచి ఫేమ్ వ‌చ్చింది, అంతేకాదు ఈ సినిమా గ్లోబ‌ల్ గా మంచి ఇమేజ్ బ్రాండ్ తీసుకువ‌చ్చింది, ఇక ఈ సినిమా నుంచి ప్ర‌భాస్ ఇండియా స్టార్ కాదు గ్లోబ‌ల్ స్టార్ అయ్యారు అనే చెప్పాలి.

ఈ సినిమా ప్రపంచంలోని ఎన్నో భాషల్లోకి అనువాదమై అక్కడ కూడా రిలీజ్ అవుతోంది. ఇటీవల ఈ సినిమా రష్యాలో రిలీజ్ అయి ఘనవిజయం సాధించింది. అక్క‌డ అభిమానుల‌కి ఈ చిత్రం బాగా న‌చ్చింది, ఇక ఈ సినిమా తాజాగా అక్క‌డ ఓ అవార్డు అందుకుంది, అది చాలా ప్ర‌త్యేక‌మైన అవార్డ్ .

రష్యన్ ఆడియన్స్ హార్ట్అవార్డు ప్రభాస్ కు లభించింది. ప్రముఖ బాలీవుడ్ నాటుడు రాజ్ కపూర్, దాదాపు 30 సంవత్సరాల క్రితం ఇదే అవార్డును అందుకున్నాడు, ఇక ఇండియాలో రాజ్ క‌పూర్ త‌ర్వాత ప్ర‌భాస్ మాత్ర‌మే ఈ అవార్డ్ అందుకున్నాడు అంటున్నారు,.