మెగా హీరోతో దేవ కట్టా..!!

మెగా హీరోతో దేవ కట్టా..!!

0
101

శర్వానంద్ తో వెన్నెల, ‘ప్రస్థానం సినిమాలతో మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న దేవ కట్టా ఆ తర్వాత నాగ చైతన్య తో ‘ఆటోనగర్ సూర్య, విష్ణు తో డైనమైట్’ వంటి చిత్రాలు తీసి పరాజయం పొందాడు. ఇక ఆ తరువాత దేవ తెలుగు లో ఏ సినిమా చేయలేదు. ప్రస్తుతం ఆయన బాలీవుడ్ లో సంజయ్ దత్ ప్రధాన పాత్రలో ‘ప్రస్థానం’ హిందీ రీమేక్ చేస్తున్నారు.

ఇది పూర్తి అవ్వగానే తెలుగులో ఓ సినిమా చేయాలనీ ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే హీరోని కూడా చూజ్ చేసుకున్నాడు దేవ కట్టా. అతనే సాయి ధరమ్ తేజ్. రీసెంట్ గా ఈ డైరెక్టర్ తేజుకి ఓ స్టోరీ చెప్పాడట. తేజుకి ఆ లైన్ నచ్చడంతో వెంటనే అతనితో సినిమాకు ఒప్పుకున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం తేజు..మారుతీ డైరెక్షన్ లో ఓ సినిమా చేయాలనీ నిర్ణయించుకున్నాడు. ఇది రెండు రోజుల్లో సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఈమూవీ పూర్తి అవ్వగానే తేజు..దేవ సినిమాను స్టార్ట్ చేస్తారట. ఈలోపు దేవ కూడా ప్రస్థానం’ హిందీ రీమేక్ పనుల్ని ముగించుకుని ఫ్రీ అవుతాడట. ఇక ఈమూవీ కూడా దేవ కట్టా గత చిత్రాలు మాదిరిగానే స్ట్రాంగ్ సోషల్ మెసేజ్ కలిగి ఉంటుందని చెబుతున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.