ప్రముఖ యాంకర్ సుమ ఇంట్లో విషాదం.

ప్రముఖ యాంకర్ సుమ ఇంట్లో విషాదం.

0
96

స్టార్ యాంకర్ సుమ కనకాల మామగారు..నటుడు రాజీవ్ కనకాల తండ్రి. సీనియర్‌ నటుడు దేవదాసు కనకాల కన్నుమూశారు.. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ చివరి శ్వాస విడిచారు. 1945లో జూలై 30న యానంలో జన్మించిన దేవదాసు స్వగ్రామం యానాం శివారులోని కనకాల పేట. విశాఖపట్టణంలోని ఎ.వి.యన్ కాలేజీలో డిగ్రీ, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో థియేటర్ ఆర్ట్స్ చదివారు. దేవదాస్ కనకాల చలిచీమలు, నాగమల్లి సినిమాలకు దర్శకత్వం వహించారు. వీరికి కుమారుడు రాజీవ్, బిడ్డ లక్ష్మి ఉన్నారు. చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్‌, రజనీకాంత్‌, శుభలేఖ సుధాకర్, నాజర్‌, భానుచందర్‌, రఘువరన్.. ఇలా చాలా మంది కనకాల గారి నట పాఠశాలలో శిక్షణ తీసుకున్న వాళ్లే.