దేవీతో సంబంధాలపై తమన్ క్లారిటీ ఆరునెలలైంది

దేవీతో సంబంధాలపై తమన్ క్లారిటీ ఆరునెలలైంది

0
106

టాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్స్ పేర్లు చెబితే వెంటనే దేవిశ్రీ ప్రసాద్ తమన్ పేర్లు గుర్తు వస్తాయి.. పెద్ద సినిమాలు అగ్రహీరోలకి బాణీలు ఇవ్వాలి అంటే వీరి తర్వాతే ఎవరైనా, ఇక చాలా మంది అగ్రదర్శకులతో హీరోలతో కలిసి పనిచేశారు, తాజాగా వీరిద్దరూ పోటీ పడి మరీ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు చిత్రాలకు.. తమన్ కూడా ఈ మధ్య దూకుడు పెంచాడు అనే చెప్పాలి.

ప్రస్తుతం మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రానికి దేవిశ్రీప్రసాద్ బాణీలు అందించగా, అల్లు అర్జున్ అల.. వైకుంఠపురములో చిత్రానికి తమన్ స్వరాలు కూర్చారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో తమన్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

దేవిశ్రీ సంగీతంలో సరిలేరు నీకెవ్వరు, మీరు సంగీతం అందించిన అల వైకుంఠపురములో ఒకేసారి వస్తున్నాయి కదా, మీపై ఒత్తిడి ఉందా అని ప్రశ్నించగా, పోటీ ఉంటేనే మనం ఏమిటో తెలుస్తుంది పోటీ ఉండాలి అని అన్నారు, అలాగే దేవీ సినిమాలు విడుదల అయితే తాను విష్ చేస్తా, తన బర్త్ డే ఇలా పలు సమయాల్లో ఇద్దరం విష్ చేసుకుంటాం అన్నారు తమన్, తను నేను కలిసి ఆరునెలలు అవుతుంది అని, దేవిశ్రీప్రసాద్ దగ్గర తొమ్మిది సినిమాలకు ప్రోగ్రామర్ గా వ్యవహరించానని తెలియచేశారు తమన్.