టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ దర్శకుడు అంటే వెంటనే డీఎస్పీ పేరు చెబుతాం.. మాస్ క్లాస్ లవ్ ఫీల్ ఎమోషన్ ఇలా ఏది ఇచ్చినా బాణీలు ఇస్తాడు మ్యూజిక్ మాంత్రికుడు దేవిశ్రీ ప్రసాద్, తాజాగా ఆయన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు, ఆయనకు బాగా ఇష్టమైన సినిమా గురించి అడిగితే, తనకు సాగర సంగమం చిత్రం చాలా నచ్చింది అని చెప్పారు ఆయన అంతేకాదు ..
ఇలాంటి నృత్య ప్రధాన చిత్రం చేయాలని ఉంటుందని తెలిపారు. అప్పటికీ, ఇప్పటికీ తాను మెచ్చే చిత్రం ‘సాగరసంగమం’ అని అన్నారు దేవీ శ్రీప్రసాద్… ప్రపంచంలో డ్యాన్స్ నేపథ్యంలో వచ్చిన అత్యుత్తమ చిత్రాల్లో ‘సాగరసంగమం’ కూడా ఉంటుందని చెప్పారు.
ఇక ఇలాంటి సినిమాలు వచ్చే రోజుల్లో కూడా రావు అని అలాంటి చిత్రం మరొకటి లేదు అని కితాబిచ్చారు, అయితే ఈ సినిమాని తీసిన దర్శకుడు కె.విశ్వనాథ్ గారు అంటే చాలా ఇష్టమని.. ఆయన కనిపిస్తే ఎన్ని సార్లు కనిపించినా అన్ని సార్లు కాళ్లపై పడతా అని అన్నారు, నిజమే విశ్వనాథ్ గారు తీసిని చిత్రాలు అన్నీ అంతే తెలుగు వారు ఉన్నంత వరకూ ఆ చిత్రాలు ఎవరూ మర్చిపోలేనివి.