దీపావళికి టార్గెట్ పెట్టుకున్నారట కమల్ – రజనీకాంత్

దీపావళికి టార్గెట్ పెట్టుకున్నారట కమల్ - రజనీకాంత్

0
98

కోలీవుడ్ లో అగ్రహీరోలుగా ఉన్నారు రజనీకాంత్ కమల్ హాసన్.. ఇద్దరూ సౌత్ ఇండియాలోనే కాదు ఇటు దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోలు, వీరి సినిమాలు దేశంలో అభిమానులు అందరూ చూస్తారు, అయితే సినీ పరిశ్రమలో ఉన్నా ఇటు రాజకీయంగా కూడా కమల్ దూసుకుపోతున్నారు, ఇటీవల ఎన్నికల్లో తమిళనాట పోటీ చేశారు కమల్, ఇటు రజనీకాంత్ పార్టీ ప్రకటన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు రాజకీయాల్లోకి రావడం లేదు అని తెలిపారు.

 

అయితే వీరిద్దరికి సినిమా కెరియర్ నుంచి మంచి స్నేహం ఉంది, ఇద్దరూ మంచి మిత్రులు.. అలాంటి ఈ ఇద్దరి సినిమాలు ఈ ఏడాది దీపావళికి రానున్నాయనే టాక్ ఇప్పుడు కోలీవుడ్లో బలంగా వినిపిస్తోంది. ఇక స్టైల్ అంటే రజనీ పేరు వినిపిస్తుంది, కొత్త ప్రయోగాలు అంటే ముందు వినిపించే పేరు కమల్ హాసన్.

 

 

రజనీకాంత్ కథానాయకుడిగా దర్శకుడు శివ అన్నాత్తే సినిమాను రూపొందిస్తున్నాడు. ఇక లాక్ డౌన్ వల్ల ఈ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యం అయింది..లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ విక్రమ్ సినిమా చేస్తున్నాడు. ఇది కమల్ సొంత సినిమా ..అయితే ఈ రెండు సినిమాలు కోలీవుడ్ మీడియా వార్తల ప్రకారం దీపావళికి వచ్చే అవకాశం ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి.