వామ్మో ధనుష్ సినిమా ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ తెలిస్తే షాక్

వామ్మో ధనుష్ సినిమా ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ తెలిస్తే షాక్

0
97

తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న తమిళ హీరో ధనుష్.. అందుకే అయన నటించిన ఏ సినిమా అయినా ఇక్కడ రిలీజ్ అవుతుంది.. రీసెంట్ గా మారి 2 తో సూపర్ హిట్ సాధించిన ధనుష్ తాజాగా మరో సినిమా తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.. అసురన్ అనే పేరుతో వెట్రిమారన్ దర్శకత్వంలో ధనుష్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ వైవిధ్యభరితంగా తెరకెక్కినవే.. దాంతో ఇప్పుడు ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా మలయాళీ ముడుగుమ్మ మంజూ వారియర్ ఈ సినిమాతో మొదటి సారి తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంది.

అక్టోబర్ 4న సినిమాను విడుదల చేస్తున్నారు. తమిళనాడు ఇతర రాష్ట్రలలో కలిపి 1000కి పైగా థియేటర్లలో సినిమాను విడుదల చేయనున్నారు. కాగా అమెరికాలో మాత్రం ఈ సినిమా 100 థియేటర్లలో విడుదల అవుతుంది.