ఆరోజు ముందుకు రానున్న ధ‌నుష్ అదిరింది ప్లాన్

ఆరోజు ముందుకు రానున్న ధ‌నుష్ అదిరింది ప్లాన్

0
89

త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్ సినిమాలు కోలీవుడ్ లో సూప‌ర్ డూప‌ర్ హిట్ అవుతాయి.. ఆయ‌న‌కు అభిమాన ఘ‌నం కూడా త‌మిళ‌నాట చాలా ఉంది ..కన్న‌డ మ‌ళ‌యాల సినిమా అభిమానుల‌తో పాటు ధ‌నుష్ కు కూడా సౌత్ లో చాలా మంది ఫ్యాన్స్ వేరే స్టేట్స్ లో కూడా ఉన్నారు.

తాజాగా ధనుష్, మేఘా ఆకాష్ జంటగా నటించిన తమిళ చిత్రం ఎన్నై నొక్కి పాయుమ్ తోట.. గౌతమ్ మీనన్ ఈ చిత్రానికి దర్శకుడు. గత నెల 29న తమిళంలో విడుదలైంది. ఈ చిత్రాన్ని తెలుగులో తూటా పేరుతో డబ్ చేస్తున్నారు. అయితే లిమిటెడ్ ప్ర‌మోష‌న్స్ జ‌రిగినా సినిమా త‌మిళ్ లో హిట్ టాక్ రావ‌డంతో ఇక్క‌డ కూడా సూప‌ర్ డూప‌ర్ హిట్ అవుతుంది అని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఈ డబ్బింగ్ వెర్షన్ ను విజయభేరి సంస్థ ద్వారా తాతా రెడ్డి, సత్యనారాయణ రెడ్డి విడుదల చేస్తున్నారు. అయితే తెలుగులో ఈ వారం సినిమాలు వ‌రుస‌గా విడుదల అవుతున్నాయి.. అందుకే తెలుగు సినిమా విడుద‌ల లేని స‌మ‌యం డిసెంబర్ 27 న చూసి ఆరోజు సినిమా రిలీజ్ చేయాలి అని ఫిక్స్ అయ్యారు. మొత్తానికి ఆరోజు వేరే చిత్రాలు లేవు కాబ‌ట్టి ధ‌నుష్ కు భారీ ఓపెనింగ్స్ వ‌చ్చే అవ‌కాశం ఉంది అంటున్నారు చిత్ర యూనిట్.