IMDb 2022లో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ తారలు వీరే

-

Dhanush tops IMDB’s list of India’s most popular stars of 2022:  గ్లోబల్ సూపర్ స్టార్ ధనుష్ IMDb జాబితాలో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ తారల అగ్రస్థానంలో ఉండగా, ఆలియా భట్ మరియు ఐశ్వర్యా రాయ్ బచ్చన్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

- Advertisement -

ర్యాంకింగ్‌లు వాస్తవంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వందల మిలియన్ల IMDb కస్టమర్‌ల పేజీ వీక్షణల ఆధారంగా నిర్ణయించబడతాయి

ముంబై, భారతదేశం—డిసెంబర్ 07, 2022—సినిమా, టీవీ మరియు సెలబ్రిటీ కంటెంట్ కోసం ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన మరియు అధికారిక మూలమైన IMDb, నేడు 2022లో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ తారలను ప్రకటించింది. IMDb దాని ఖచ్చితమైన టాప్ 10 జాబితాలను IMDb యొక్క 200 మిలియన్ల కంటే ఎక్కువ ఉన్న నెలవారీ సందర్శకుల వాస్తవ పేజీ వీక్షణల ఆధారంగా నిర్ణయిస్తుంది. ది గ్రే మ్యాన్ మరియు తిరుచిత్రంబలం వంటి బహుభాషా చిత్రాల విజయవంతమైన విడుదలలతో అభిమానుల ఆసక్తిని పెంచి ధనుష్ ఈ సంవత్సరంలో అగ్రస్థానం పొందిన సెలబ్రిటీ.

IMDb ప్రకారం 2022లో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ తారలు*

1. ధనుష్
2. అలియా భట్
3. ఐశ్వర్య రాయ్ బచ్చన్
4. రామ్ చరణ్ తేజ
5. సమంతా రూత్ ప్రభు
6. హృతిక్ రోషన్
7. కియారా అద్వానీ
8. ఎన్.టి. రామారావు జూనియర్
9. అల్లు అర్జున్
10. యష్

*2022లో IMDb టాప్ 10 అత్యంత జనాదరణ పొందిన భారతీయ తారల జాబితాలో స్థానం పొందిన తారలు 2022 అంతటా IMDb వీక్లీ ర్యాంకింగ్ చార్ట్‌లో స్థిరంగా అత్యధిక ర్యాంక్‌ పొందిన వారు. ఈ ర్యాంకింగ్‌లు IMDbకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 200 మిలియన్ల కంటే ఎక్కువ నెలవారీ సందర్శకుల వాస్తవ పేజీ వీక్షణల ఆధారంగా ఉంటాయి.

“ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు భారతీయ సినిమా, వెబ్‌సిరీస్ మరియు తారల గురించి మరింత తెలుసుకోవడానికి IMDbపై ఆధారపడి ఉన్నారు మరియు మా టాప్ 10 ప్రముఖ భారతీయ తారల జాబితా ప్రపంచ ప్రజాదరణను నిర్ణయించడానికి మరియు కెరీర్ మైలురాళ్ళు మరియు పురోగతి క్షణాలను గుర్తించడానికి బెంచ్‌మార్క్‌గా స్థిరపడింది” అని యామినీ పటోడియా, IMDb ఇండియా హెడ్ చెప్పారు. “వివిధ ప్రాంతాలలోని కళాకారులు ప్రపంచవ్యాప్తంగా వేడుకలు చేసుకుంటున్నారు, ఇది దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిభకు నిదర్శనం. ధనుష్ వంటి నటులు గుర్తింపు పొంది, ర్యాన్ గోస్లింగ్ మరియు క్రిస్ ఎవాన్స్ వంటి హాలీవుడ్ తారలతో జతకడుతుండగా, మనం ఎన్. టి. రామారావు జూనియర్ మరియు రామ్ చరణ్ తేజ మహత్తర చిత్రం RRR వంటి చిత్రాలకు కూడా సాక్షులైయ్యాము. నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ సినిమాల్లోకి తిరిగి రావడం విమర్శకులు మరియు అభిమానుల నుండి విస్తృతమైన ప్రశంసలను అందుకుంది.

IMDbతో ప్రత్యేకంగా మాట్లాడుతూ, అలియా భట్ ఈ సంవత్సరం జాబితాలో తన పేరు చేర్చినందుకు తన ప్రశంసలను ఇలా పంచుకుంది, “ నాకు ఇంతవరకు సినిమాల్లో మరపురాని సంవత్సరం 2022- ఈ సంవత్సరం నా సినిమాలన్నిటికి ప్రేక్షకులు అందించిన ప్రేమకు నేను ఎప్పటికీ ధన్యవాదములు చెపుతున్నాను మరియు

కృతజ్ఞతతో కూడియున్నాను మరియు మన దేశంలోని అత్యుత్తమ చిత్రనిర్మాతలు మరియు కళాకారులతో కలిసి పనిచేసినందుకు గౌరవంగా భావిస్తున్నాను. IMDb ప్రజల స్వరానికి నిజమైన నిదర్శనం మరియు నేను కెమెరా గలిగినంత కాలం ప్రేక్షకులను అలరించగలనని ఆశిస్తున్నాను! చాలా ప్రేమతో మరోసారి ధన్యవాదాలు.”

ఈ సంవత్సరం అత్యంత ప్రజాదరణ పొందిన తారల గురించి అదనపు సమాచారం:

  • ధనుష్ (నం. 1) 2022లో ఐదు టైటిల్స్‌లో కనిపించాడు; నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ ది గ్రే మ్యాన్ మరియు తమిళంలో మారన్, తిరుచిత్రంబలం, నానే వరువెన్ మరియు వాతి విడుదలయ్యాయి.
  • ఎస్. ఎస్. రాజమౌళి యొక్క మహత్తర RRR (రైజ్ రోర్ రివోల్ట్) లో ప్రధాన తారాగణం—ఆలియా భట్ (నం. 2), రామ్ చరణ్ తేజ (నం. 4), మరియు ఎన్. టి. రామారావు జూనియర్ (నం. 8)-అందరూ జాబితాలోకి ప్రవేశించారు.
  •  గంగూబాయి కతియావాడికి నాయకత్వం వహించి, డార్లింగ్స్ (దీనిని ఆమె నెట్‌ఫ్లిక్స్ కోసం కూడా నిర్మించారు) లో నటించి, అలాగే గ్లోబల్ హిట్ బ్రహ్మాస్త్రా పార్ట్ వన్: శివలో ఇషా పాత్రను పోషించడం ద్వారా భట్ అభిమానులను ఆనందపరిచారు.

• ఐశ్వర్య రాయ్ బచ్చన్ (నం. 3) పొన్నియన్ సెల్వన్: పార్ట్ Iలో తన అద్భుతమైన నటనతో ఐదేళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లోకి రావడం వినోద అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసారు.
• కియారా అద్వానీ (నం. 7) జగ్‌జగ్‌జీయో మరియు భూల్‌భూలైయా 2 అనే రెండు బ్లాక్‌బస్టర్ విడుదలలతో ప్రేక్షకులను ఆకర్షించింది.

ఈ సంవత్సరం IMDbలో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ తారల గురించి మరింత తెలుసుకోవడానికి,

ఇక్కడ వీడియోని చూడండి

పూర్తి జాబితాను ఇక్కడ చదవండి 

Read Also: ప్రయాణికుల కోసం కాంటాక్ట్‌లెస్‌ బోర్డింగ్‌ను ప్రారంభించిన ఎన్‌ఈసీ ఇండియా

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...