ధర్మవరపు సుబ్రహ్మణ్యం గురించి ఈ విషయాలు మీకు తెలుసా రియల్లీ గ్రేట్ పర్సెన్

ధర్మవరపు సుబ్రహ్మణ్యం గురించి ఈ విషయాలు మీకు తెలుసా రియల్లీ గ్రేట్ పర్సెన్

0
83

ధర్మవరపు సుబ్రహ్మణ్యం టాలీవుడ్ లో ఎంతో మంచి ఫేమ్ సంపాదించుకున్న కమెడియన్, అంతేకాదు ఆయనంటే ఎందరికో ప్రత్యేక అభిమానం కూడా.. ముఖ్యంగా లెక్చరర్ పాత్రలకు ఆయన పెట్టింది పేరు, ఇక టీచర్ గా ఆయన చేసే కామెడీ తెగ నవ్వు తెప్పిస్తుంది సినిమాల్లో, మరీ ముఖ్యంగా ఆయన డైలాగ్స్ అద్బుతం అనే చెప్పాలి, కాని విషాదం ఏమిటి అంటే ఆయన
2013లో మరణించారు.

అయితే ఆయన జీవితంలో కొన్ని వందల సినిమాలు చేశారు, కాని చివరి రోజుల్లో ఆయనని ఎవరూ పట్టించుకోలేదు చిత్ర సీమ చూడలేదు అంటారు.. ఇలాంటి విషయాలపై వారి కుటుంబ సభ్యులు కొన్ని విషయాలు తెలిపారు, అదేమిటి అంటే ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారిని చూడాలి అని చాలా మంది ఆస్పత్రికి వద్దాము అని అనుకున్నారట, కాని ఆయనే వద్దు అనేవారట, సుమారు పది నెలలు ఆయన ఆస్పత్రిలో చికిత్స తీసుకుని మరణించారు.

చాలా మంది నటులు వద్దాము అని అనుకున్నా ఆయన వద్దు అనేవారట, వారు నన్ను చూసి బాధపడతారు అని ఫీల్ అయ్యేవారట.తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం పొందిన అగ్రశ్రేణి హాస్యనటులలో ఆయనకు పేరు ఉంది.. చివరి రోజుల్లో ఆయన ఆర్దిక ఇబ్బందులు పడ్డారు అని కూడా వార్తలు వచ్చాయి.. కాని ఇది కూడా వాస్తవం కాదు, అని ఆయన కుమారులు తెలిపారు, ఆయన ఆర్దికంగా చాలా ప్లానింగ్ చేసుకున్న వ్యక్తి అని తెలిపారు కుటుంబ సభ్యులు..1989లో నటుడిగా మొదలైన సుబ్రహ్మణ్యం ప్రయాణం 2013 వరకూ చిత్ర సీమలో కొనసాగింది, అంతేకాదు ఆయనకు వైయస్ రాజశేఖర్ రెడ్డి అంటే అభిమానం.. ఇద్దరూ మంచి మిత్రులుగా ఉండేవారు.. కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉండేవారు…ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సంఘం ఛైర్మన్గా కూడా పనిచేశారు.