ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ చైతన్య(Choreographer Chaitanya) మాస్టర్ ఆత్మహత్య చేసుకున్నారు. నెల్లూరులోని క్లబ్ హోటల్‌లో అతడు సూసైడ్ చేసుకుంటున్నట్లు సూసైడ్ వీడియో విడుదల చేశారు. ఆర్థిక ఇబ్బందులే ఇందుకు కారణమని చెబుతున్నారు. కాగా, ఆత్మహత్యకు ముందు చైతన్య సెల్ఫీ వీడియో రికార్డ్ చేశారు. ఈ సందర్భంగా ఈ పని చేస్తున్నందుకు తన తల్లిదండ్రులకు, తన తోటి డ్యాన్స్ మాస్టర్లకు, డ్యాన్సర్లకు సారీ చెప్పాడు చైతన్య. అప్పులు ఇచ్చినవాళ్లు ఇచ్చిన ప్రెజర్ తట్టుకోలేకపోతున్నాని.. చాలా ట్రై చేసినా అవ్వడం లేదని అతడు తెలిపాడు. కాగా, ప్రముఖ డ్యాన్స్ షో ఢీలో కొరియోగ్రాఫర్‌గా రాణించి అదరగొట్టిన చైతన్య మాస్టర్ మరణం బుల్లితెర ప్రేక్షకులకు తీరని లోటని తోటి డ్యాన్సర్లు సంతాపం ప్రకటిస్తున్నారు.