బ్రేకింగ్: డైలాగ్‌ కింగ్‌ మంచు మోహన్‌ బాబు ఇంట తీవ్ర విషాదం

Dialogue King Manchu Mohan Babu's house tragedy

0
74

టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు, డైలాగ్‌ కింగ్‌ మంచు మోహన్‌ బాబు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. మంచు మోహన్‌ బాబు సొంత తమ్ముడు రంగ స్వామి నాయుడు మృతి చెందారు. కాసేపటి క్రితమే రంగ స్వామి నాయుడు ఆస్పత్రిలో మరణించినట్లు సమాచారం.  తిరుపతిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారని తెలుస్తోంది.

రంగ స్వామి నాయుడు వయస్సు 63 సంవత్సరాలు. గత కొన్ని రోజుల నుంచి రంగ స్వామి నాయుడు అనారోగ్యంతో బాధ పడుతున్నారు.  ఇక రంగ స్వామి నాయుడు మృతి పట్ల పలుగురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.