కరోనా కాలంలో కష్టాలు ఎందుర్కొంటున్న సినిమా ఆర్టిస్టులకు ఉపాధి కరువు అయిన వారికి సినిమా పరిశ్రమ అండగా నిలబడింది, ఆర్ధిక సాయంతో పాటు వారికి నిత్య అవసర వస్తువులు కూడా అందించారు, ఇటు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ అగ్రహీరోలు నిర్మాతలు దర్శకులు అందరూ ఈ సాయం చేశారు.
ఇక నేరుగా పలువురు హీరోలు ఆ కుటుంబాలకి సాయం అందించారు, తాజాగా హీరో సూర్య భారీ విరాళం ప్రకటించాడు. కరోనా కాలంలో సినిమా ఆఫర్లు లేక ఆర్థిక సమస్యలతో సతమవుతున్న వారికి చేయూతగా సూర్య సుమారు 5 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు, దీంతో సూర్య చేసిన సాయానికి అభిమానులు తమిళ సినిమా పరిశ్రమ వారు ఎంతో ఆనందించారు.
సినీ పరిశ్రమ మనుగడకు ఎన్నో కుటుంబాలు పనిచేస్తున్నాయన్నారు. కరోనా వల్ల ఆర్టిస్టులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కష్ట కాలంలో ఎంతోమంది నాకు అండగా నిలిచారు. ఈ పరిస్థితుల కారణంగానే డిజిటల్ మీడియాలో ఆకాశమే హద్దురా సినిమాను విక్రయించామన్నారు. సూర్య తన సొంత ప్రొడక్షన్ 2D ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించారు. నిజంగా సూర్య చేసిన సాయానికి అభినందించాల్సిందే.