టాలీవుడ్ లో క్యూట్ కపుల్స్ అంటే ముందు వినిపించే పేరు నాగచైతన్య సమంత… ఇద్దరూ సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు, ఇటీవల పలు యాడ్లు కూడా చేస్తున్నారు ఇద్దరూ, సమంత వరుస సినిమాలతో బిజీగా ఉంటే,ఇటు చైతన్య కూడా తన సినిమాలతో బిజీగా ఉన్నారు, అలాగే పలు కథలు వింటున్నారు.
ఈ సమయంలో అక్కినేని అభిమానులు కూడా ఎప్పుడు పిల్లలు అంటూ పదే పదే అడుగుతున్నారు, దీనిపై సమంత నాగచైతన్య మాత్రం ఏ సమాధానం చెప్పడం లేదు.. అయితే తాజాగా వీరిద్దరూ చేసిన యాడ్ ద్వారా పిల్లల విషయంలో క్లారిటీ ఇచ్చారు అంటున్నారు అభిమానులు.
చైతూ సమంత రీసెంట్ గా ఓ కమర్షియల్ యాడ్లో కలిసి నటించారు. ఆ సమయంలో సమంత పిల్లల డ్రెస్ ఫొటోలు చూపించి వీరు క్యూట్గా ఉన్నారనడం.. అలాంటివి ప్లాన్ చేయకని చెప్పడం చేశాడు చైతూ, దీంతో ఇప్పుడు పిల్లలు వద్దు అనుకుంటున్నారు అనేది దీంతో క్లారిటీ వచ్చింది అంటున్నారు అభిమానులు.