‘సీతారామం’ సినిమాతో మృణాల్ ఠాకూర్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమాలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. సినిమాలోని సీత పాత్రకు మరెవరిని ఊహించుకోలేనంతగా పాత్రలో లీనం అయింది. నూర్జహాన్ ప్రిన్సెస్ గా మృణాల్ నటన అందరిని ఆకట్టుకుంది. అయితే మృణాల్ కు ఈ సినిమా ఛాన్స్ ఎలా వచ్చిందో తెలుసా?
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ప్రాజెక్ట్ K. ఇందులో హీరోయిన్ గా మొదటగా దీపికా పదుకొనెను అనుకోలేదట. ముందుగా ఈ అవకాశం మృణాల్ కు వచ్చిందే. కానీ హనురాఘవపూడి కథ విన్న నాగ్ అశ్విన్ సీత పాత్రకు మృణాల్ చక్కగా సరిపోతుందని సూచించారు.
దీనితో ఆమెను సీతారామంలో భాగం చేశారు. ఇక ప్రాజెక్ట్ కే లో హీరోయిన్ గా మరో బాలీవుడ్ భామ దీపకను ఎంపిక చేసుకున్నారట. అయితే ఈ విషయాలన్నీ నిర్మాత అశ్వనీదత్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడంతో బయటకు తెలిశాయి. అలా మృణాల్ సీతారామంలో భాగం అయింది.