కిక్, రేసుగుర్రం, సైరా ఈ సూపర్ హిట్ సినిమాల పేర్లు చెబితే వెంటనే దర్శకుడు సురేంద్ రెడ్డి పేరు గుర్తుకు వస్తుంది.. సినిమాల్లో టేకింగ్ లో ఆయన స్టైలే వేరు అంటారు అందరూ.. హీరోయిజం అద్బుతంగా చూపిస్తారు సురేందర్ రెడ్డి, అయితే ఇప్పుడు ఆయన పవన్ కల్యాణ్ తో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నారు అని ఏర్పాట్లు జరుగుతున్నాయి అని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇటీవల ఆయన పవన్ ని కలిశారని ఓ మంచి స్టోరీ వినిపించారు అని తెలుస్తోంది, అయితే ఈ కథకి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని వార్తలు వినిపిస్తున్నాయి, అయితే దీనిపై ఇంకా ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు, ప్రస్తుతం సురేందర్రెడ్డి అఖిల్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ ను లైన్ లో పెట్టారు.
అఖిల్ ప్రస్తుతం నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా పూర్తిచేసిన వెంటనే సురేందర్ రెడ్డి ప్రాజెక్టును సెట్స్పైకి తీసుకెళ్లనున్నారు. ఇక ఆ సినిమా పూర్తి అయిన తర్వాత పవన్ సినిమా చేసే అవకాశం ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి, అయితే పవన్ చేతిలో ఉన్న మూడు ప్రాజెక్టులు చేసిన తర్వాత ఈ సినిమా ఉండచ్చు అనే టాక్ టాలీవుడ్ లో నడుస్తోంది.