శ్రియ, నిత్యామేనన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘గమనం’. ఈ మూవీ నేడు థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం..
కమల(శ్రియ) చెవులు వినబడని ఓ దివ్యాంగురాలు. దుబాయ్‌కు వెళ్లిన భర్త కోసం ఎదురుచూస్తూ చంటి బిడ్డతో కలిసి ఓ మురికివాడలో కాలం వెళ్లదీస్తుంటుంది. చెవులు వినిపించేందుకని వైద్యం కూడా చేయించుకుంటుంది. భర్త మాటలు వినాలని తహతహలాడుతుంది.
రెండో కథలో క్రికెటర్ కావడమే లక్ష్యంగా శ్రమిస్తున్న అలీ (శివ కందుకూరి), తన పక్కింటి అమ్మాయి జారా (ప్రియాంక జవాల్కర్)తో ప్రేమలో పడతాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటారు.
మూడో కథలో పుట్టినరోజంటే ఏమిటో తెలియని అనాథ పిల్లలైన ఇద్దరు కేక్ కోసమని రూ.300 సంపాదించాలనుకుంటారు. అనుకోకుండా వచ్చిన ప్రకృతి విపత్తుతో ఆ మూడు కథలు ఎలాంటి మలుపులు తిరిగాయి. వాళ్లు కన్న కలలు నెరవేరాయా? లేదా? అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే: ఈ సినిమాలో ప్రథమార్ధం మొత్తం పాత్రల్ని, వారి నేపథ్యాల్ని పరిచయం చేసి వదిలేసినట్టే ఉంటుంది తప్ప, అందులో కథేమీ ఉండదు. ఇక ఉన్న ఓ చిన్న మలుపుని కూడా ట్రైలర్‌లోనే చూపించడం వల్ల సినిమాలో చూడటానికి ఏమీ మిగల్లేదనిపిస్తుంది. మూడు కథల్ని పరిచయం చేసిన విధానం కూడా డాక్యుమెంటరీ తరహాలో నిదానంగా.. చప్పగా సాగడం సినిమాకు మైనస్‌గా మారింది. వీధి బాలలు, మురికివాడల జీవితాన్ని సహజంగా ఆవిష్కరించిన తీరు మాత్రం మెప్పిస్తుంది.
హైదరాబాద్ వరదలతో ఈ కథను తీర్చిదిద్దడం వల్ల కొద్దిలో కొద్దిగా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. కానీ ఆ కథల్ని హృద్యంగా మలచడంలో దర్శకురాలు విఫలమయ్యారు. ఆమెకు ఇదే తొలి చిత్రం కాబట్టి అనుభవ లేమి అడుగడుగునా కనిపిస్తుంది. అయితే అనుభవం ఉన్న పలువురు సాంకేతిక నిపుణులు ఈ సినిమాలో ఉన్నా వాళ్ల ప్రభావం కూడా పెద్దగా కనిపించదు. సాయిమాధవ్ బుర్రా కలం మెరుపులు ఒకట్రెండు చోట్ల కనిపిస్తాయంతే. ఇళయరాజా సంగీతం పతాక సన్నివేశాల్లోనే ప్రభావం కనిపిస్తుంది. జ్ఞానశేఖర్ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. దర్శకురాలు సుజనారావు రాసుకున్న పాత్రల్లో బలం ఉంది. వాటిలో సంఘర్షణే సరిపడలేదు.
సినిమాకు ప్రధాన ఆకర్షణ శ్రియనే. ఆమె పాత్ర, నటనే సినిమాకు బలం. చెవులు వినిపించని ఓ గృహిణిగా చక్కటి అభినయం ప్రదర్శించింది. భర్త రాడని తెలిసినప్పుడు ఆమె పండించిన భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. జ్ఞానశేఖర్ కెమెరా వరదల్ని, మురికివాడల్ని చాలా బాగా చూపించింది. సుజనారావు రాసుకున్న కథ పర్వాలేదు కానీ, దాన్ని తెరపైకి తీసుకొచ్చిన విధానమే మెప్పించదు.
బలాలు
శ్రియ, కొన్ని సన్నివేశాలు, కథ, కెమెరా పనితనం
బలహీనతలు