సినిమా హిట్ అయింది అంటే వెంటనే ఆ హీరోకి పలు దర్శకులు వచ్చి కధలు చెబుతారు, అంతేకాదు ఆ దర్శకుడి దగ్గరకు చాలా మంది హీరోలు కబురుపంపి మంచి స్టోరీ వినిపించమంటారు…ఇక నటి హీరోయిన్ కి పలు అవకాశాలు వస్తాయి…ఇది ఏ చిత్ర సీమలో అయినా జరుగుతుంది… అందుకే హిట్ కోసం చూస్తారు దర్శక హీరోలు… తాజాగా ఉప్పెన చిత్రం మంచి హిట్ సాధించింది.
మెగా హీరో వైష్ణవ్ తేజ్ కు మంచి గుర్తింపు వచ్చింది… ఇక దర్శకుడు బుచ్చిబాబు పేరు మార్మోగిపోతోంది… దర్శకుడు సుకుమార్ శిష్యుడిగా ఆయన టాలీవుడ్ చిత్ర సీమలో చాలా మందికి తెలిసిన వ్యక్తి…. ఉప్పెన చిత్రం బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ కావడంతో ఆయనకు పలు ఆఫర్లు వస్తున్నాయి.
ఇక మైత్రీతో ఆయన రెండు చిత్రాలు చేయనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి, అంతేకాదు తాజాగా అక్కినేని అఖిల్ తో సినిమా అని వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే తాజాగా ఎన్టీఆర్ తో కూడా ఆయన ఓ సినిమా చేస్తారు అంటున్నారు…
ఎన్టీఆర్ తో బుచ్చిబాబుకి ఇప్పటికే సాన్నిహిత్యం వుంది. గతంలో నాన్నకు ప్రేమతో సినిమా చేసిన సమయంలో బుచ్చిబాబు సుకుమార్ దగ్గర వర్క్ చేశారు ఆ సమయంలో ఇద్దరికి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది.. ఇప్పుడు మైత్రీతో కలిసి ఎన్టీఆర్ తో ఓ సినిమా చేస్తారు అని వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే కథతో బిజీగా ఉన్నారట బుచ్చిబాబు.