మెగాస్టార్ కోసం ఆ దర్శకుడు టైటిల్ ఇచ్చేశారా ?

Did that director give the title for Megastar movie

0
126

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఇటీవల టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. చిత్ర యూనిట్ కొన్ని రోజులుగా వేగంగా ఈ చిత్రీకరణ చేశారు. ఇక రెండు పాటలు షూటింగ్ చేయాల్సి ఉంది. ఈ నెల 20వ తేదీ నుంచి 31వ తేదీ వరకూ రెండు పాటలను చిత్రీకరించనున్నారు. టాలీవుడ్ టాక్ ప్రకారం దసరాకి ముందే ఈ సినిమా విడుదల చేస్తారు అని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదల అనేది ఈ నెలలో క్లారిటీ రానుంది.

ఈ సినిమా తరువాత మలయాళంలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న లూసిఫర్ సినిమా రీమేక్ లో చిరంజీవి చేయనున్నారు. ఈ సినిమాకి దర్శకుడిగా మోహన్ రాజా చేయనున్నారు. ఇక ఆచార్య పూర్తి అయిన తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.ఈ సినిమాకి కొద్ది రోజులుగా ఓ టైటిల్ తెగ వైరల్ అవుతోంది. ఈ టైటిల్ ఫిక్స్ చేస్తారు అని అందరూ మాట్లాడుకుంటున్నారు.

ఇంతకీ ఆ టైటిల్ ఏమిటి అంటే గాడ్ ఫాదర్ అనే టైటిల్. కానీ ఈ టైటిల్ దర్శకుడు సంపత్ నంది దగ్గర ఉందని తెలుస్తోంది. అయితే చిరు సినిమా కోసం ఆ టైటిల్ ను సంపత్ నంది ఇచ్చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో సత్యదేవ్ కీలక పాత్రలో చేయనున్నారు