టాలీవుడ్ ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ అంటే అందరికి ప్రత్యేకమైన అభిమానం.. అన్నీ సినిమాలు ఆయనకు విజయాలే… అందుకే ఆ విక్టరీని తన ఇంటి పేరు బదులు పెట్టుకున్నారు.. అభిమానులు చిత్ర సీమ అందరూ ఆయనని విక్టరీ వెంకటేష్ అని పిలుస్తారు, అయితే ఆయన పలువురు హీరోలతో మల్టీస్టారర్ చిత్రాలు చేయడానికి కూడా ముందుకు వస్తారు.
అయితే తాజాగా ఆయన పుట్టిన రోజున అందరూ విషెస్ అందచేశారు, ఈ సమయంలో పవన్ కల్యాణ్ వెంకీ స్నేహం గురించి కీలక మాట చెప్పారు , తాను హీరో కాకముందు నుంచి వెంకటేశ్ తో పరిచయం ఉందని, తరచుగా వెంకటేశ్ తో మాట్లాడుతుండేవాడ్నని వివరించారు.
వెంకటేష్ కూడా చాలా ఎక్కువగా పుస్తకాలు చదువుతారు అని ఆధ్యాత్మిక ధార్మిక లౌకిక సంబంధ పుస్తకాలు చదువుతారు అని తెలిపారు, ఇలా అనేక విషయాలు మేము మాట్లాడుకునేవాళ్లం అని తెలిపారు.
ఆ స్నేహమే గోపాల గోపాల చిత్రంలో నటించేలా చేసింది. మా ఆలోచనలకు ఆ సినిమా అద్దంపట్టింది అని పవన్ తెలిపారు.