మూవీ లెజెండ్ దాసరి – హీరో శోభ‌న్ బాబు మ‌ధ్య జ‌రిగిన ఈ విష‌యం మీకు తెలుసా

Did you know that this happened between hero Shobhan Babu and Movie Legend Dasari

0
128

సినిమా ఇండ‌స్ట్రీలో సీనియ‌ర్ హీరోలు కొత్త ద‌ర్శ‌కుల‌కి సినిమా ఛాన్స్ ఇవ్వాలంటే భ‌య‌ప‌డ‌తారు. అయితే ఇది ఏనాటి నుంచో ఉన్న ప‌రిస్దితి. ఎవ‌రు అవున‌న్నా కాద‌న్నా. అయితే కొంద‌రు హీరోలు మాత్రమే ఈ డేర్ చేస్తారు. మూవీ లెజెండ్ దాసరి విషయంలో కూడా ఇలాగే ఓసారి జరిగిందట.
దాస‌రి నారాయ‌ణ‌రావు గారు ఆయ‌న ఓ గొప్ప ద‌ర్శ‌కుడు . ఎక్క‌డో పాల‌కొల్ల నుంచి వ‌చ్చి దేశం గ‌ర్వించేలా ఎన్నో గొప్ప సినిమాలు తీశారు ఆయ‌న‌.

తాతమనవడు సినిమాతో ద‌ర్శ‌కుడు అయ్యారు. ఎస్వీరంగారావు రాజ‌బాబు పాత్ర‌లకు ఈ సినిమాలో ఎంతో పేరు వ‌చ్చింది. ఈ సినిమాని ముందుగా అప్పటికీ స్టార్ హీరో అయిన శోభన్ బాబుతో చేయాలని అనుకున్నారట దాసరి.

రాజబాబు పాత్రను ఆయనను దృష్టిలో పెట్టుకొని రాసుకున్నారట దాసరి నారాయ‌ణ రావు . కానీ శోభ‌న్ బాబు కొత్త ద‌ర్శ‌కుడు కావ‌డంతో ఈ పాత్ర వ‌దులుకున్నార‌ట. త‌ర్వాత రాజ‌బాబుతో ఈ పాత్ర చేయించారు
ఈ చిత్రం సూప‌ర్ హిట్ అయింది. ఈ సినిమాకి ఏకంగా నంది అవార్డు కూడా లభించింది. త‌ర్వాత రోజుల్లో దాస‌రిగారు క‌నిపించిన‌ప్పుడు ఈ సినిమా మిస్ చేసుకున్నా అని ఫీల్ అయ్యేవార‌ట శోభ‌న్ బాబు. ఆ త‌ర్వాత వీరి కాంబోలో అనేక చిత్రాలు వచ్చాయి అన్నీ సూప‌ర్ హిట్ అయ్యాయి.