ఇండియాలోనే రిచెస్ట్ హీరో షారుఖ్ ఖాన్(Shahrukh Khan).. ఈరోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన షారుఖ్.. ఇప్పుడు ఇండియాలో అత్యంత ధనికుడైన నటుడిగా నిలిచాడు. సీరియల్స్‌తో తన యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించిన షారుఖ్.. సినిమాల్లోకి అరంగేట్రం ఇచ్చి.. ఇప్పుడు బాలీవుడ్ కా బాద్‌షా అనిపించుకున్నాడు. దేశంలో అత్యంత ధనికుడైన హీరో ఎవరంటే.. టక్కునచెప్పే పేరు కూడా షారుఖ్‌దే అందులో అవాస్తవం ఏమీ లేదు. కానీ అతడి ఆస్తుల విలువ ఎంతో తెలుసా? తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే?
షారుఖ్ ఖాన్ ఆస్తుల విలువ దాదాపు రూ.7300 కోట్లకు పైమాటే. సినిమా, వ్యాపారాలు, ప్రకటనలు, ఐపీఎల్ ఫ్రాంఛైజీ ఇలా ఎన్నో మార్గాల నుంచి షారుఖ్.. భారీగానే సంపాదిస్తున్నాడు. ఏడాదికి షారుఖ్ ఖాన్.. రూ.300 కోట్ల వరకు సంపాదిస్తున్నట్లు ఒకానొక సర్వే తెలుపుతోంది. అదే విధంగా ఒక్కో సినిమాకు గానూ రూ.120-150 కోట్లు పారితోషికం అందుకుంటున్నట్లు బీటౌన్ సర్కిల్స్ చెప్తున్నాయి. షారుఖ్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఉండటమే ఫారుఖ్‌కు అడిగినంత పారితోషికం ఇవ్వడానికి ప్రధాన కారణమని కూడా టాక్ ఉంది. ఈ మధ్య ఎక్కువగా షారుఖ్(Shahrukh Khan) సినిమాలను తనకే చెందిన రెడ్ చిల్లీస్ సంస్థ ద్వారా ఫారుఖ్ భార్య గౌరీ ఖాన్ నిర్మిస్తోంది.