బాలయ్య ‘107’ మూవీ సెట్ లో శృతి హాసన్..సెల్ఫీలో ఫన్నీ ఎక్స్​ప్రెషన్​

0
95

బాలయ్య వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం గోపి చంద్ మలినేనితో NBK 107 సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత అనిల్ రావిపూడితో మరో సినిమా ప్లాన్ చేశాడు. ఇవే కాక ఆదిత్య 369కి సీక్వెల్, అఖండ సీక్వెల్ కు నందమూరి నటసింహం ప్లాన్ చేస్తున్నాడు.

ఇప్పటికే NBK 107 ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల కాగా, ఈ సినిమా టీజర్ కూడా విడుదలైంది. 25న కర్నూలు నగర శివార్లలో నందమూరి బాలకృష్ణ NBK107 సినిమా షూటింగ్ జరిగింది. 26న పంచలింగల వద్ద బాలకృష్ణ షూటింగ్ జరుగనుంది. కొండారెడ్డి బురుజు సెంటర్‌ సహా అక్కడి పరిసర ప్రాంతాల్లో ఈ షూటింగ్​ జరుగుతోంది.

ఈ షెడ్యూల్​లో హీరోయిన్​ శ్రుతిహాసన్​ షూట్​ లో పాల్గొనగా..అందుకు సంబంధించి ఓ పిక్​ను పొస్ట్​ చేసింది. విరామం సమయంలో బాలయ్యతో కలిసి దిగిన సెల్ఫీని అభిమానులతో పంచుకుంది. ఇందులో హీరోయిన్​ శ్రుతిహాసన్ కూడా ఉన్నారు. ఈ పిక్​లో ఆమె ఇచ్చిన కామెడీ ఎక్స్​ప్రెషన్​ అభిమానులను నవ్విస్తోంది. ఇది నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.