డిఫరెంట్ గా ఆలోచిస్తున్న ఉపాసన

డిఫరెంట్ గా ఆలోచిస్తున్న ఉపాసన

0
175

యువర్ లైఫ్ అనే ఆల్ ఇన్ వన్ ఆమె ఫ్లాట్ ఫారం స్థాపించిన మెగా కోడలు ఉపాసన.. దాని ద్వారా సాధ్యమైనంత వరకు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఓ టాలెంట్ షో ను నిర్వహించనున్నారు.

ఈ షో ద్వారా మానసికంగా, భౌతికంగా దివ్యాంగుల అయిన వారిలో దాగివున్న డ్యాన్స్ టాలెంట్ ను వెలికితీసి వారిలోని ప్రతిభను ప్రపంచానికి చూపించాలని ఉపాసన ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నంలో రామ్ చరణ్ తో పాటు కొరియోగ్రాఫర్ ప్రభుదేవా, ఫరాఖాన్ కూడా భాగమవుతున్నారు.

ఇప్పటికే ఆమె అక్కినేని కోడలితో కలిసి ఎటువంటి పోషకాహారం తీసుకోవాలో చెబుతుంది. ఇప్పుడు ఈ షో ద్వారా మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆన్లైన్ ద్వారా జరగనున్న ఈ షోకి సంబంధిత వివరాలు తెలుపుతూ ఉపాసన ఓ పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.