తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి (Film Chamber Elections) ఎన్నికల్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్యానల్ ఘన విజయం సాధించింది. టీఎఫ్‌సీసీ నూతన అధ్యక్షుడిగా దిల్ రాజు ఎన్నికయ్యారు. మేజిక్ ఫిగర్‌కు 25 కావాల్సి ఉండగా.. ప్రత్యర్థి ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్‌పై 31 ఓట్లతో ఘన విజయం సాధించారు. టీఎఫ్‌సీసీ ఉపాధ్యక్షుడిగా ముత్యాల రామరాజు, కార్యదర్శిగా దామోదర ప్రసాద్, కోశాధికారిగా ప్రసన్న కుమార్‌లు గెలుపొందారు.
ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ ఎన్నికల్లో మొత్తం 1339 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎగ్జిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, స్టూడియోల యజమానులు సహా సుమారు రెండువేలకు పైగా టీఎఫ్‌సీసీలో సభ్యులుగా ఉన్నారు. కాగా, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు(Film Chamber Elections) ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకూ పోలింగ్ జరిగింది. అనంతరం కౌంటింగ్ ప్రారంభించి రాత్రి 9 గంటల తర్వాత తుది ఫలితాలను ప్రకటించారు. ఈ కొత్త కార్యవర్గం 2023-2025 వరకు కొనసాగనుంది.