టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత రామానాయుడు తర్వాత అంత మంచి పేరు సంపాదించుకున్నారు దిల్ రాజు… కొత్త దర్శకులని హీరోలని పరిచయం చేసిన ఘనత ఆయనకు దక్కుతుంది, దర్శకుడు కధలు చెప్పిన వెంటనే అది సినిమాగా ఎలా వస్తుంది అనేది ఈజీగా చెప్పగలరు ఆయన.. అందుకే దిల్ రాజ్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా టాలీవుడ్ లో ఉన్నారు.
ఇక ఇంత మంది దర్శకులని హీరోలని నటులని పరిచయం చేసిన ఆయన తాజాగా తన వారసుడ్ని సినిమాల్లోకి తీసుకువస్తున్నారు, మరి ఆయన వారసుడు అంటే ఎవరు అనుకుంటున్నారా..
దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి కుమారుడు ఆశీష్ రెడ్డి, ఇక ఆయన సినిమాల్లోకి రానున్నారు అనేది తెలిసిందే.
హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు ఆశీష్ రెడ్డి..ఈ సినిమాకు పలుకే బంగారమాయె అనే టైటిల్ కన్ఫర్మ్ చేసారు.
హుషారు సినిమా దర్శకుడు శ్రీహర్ష కొనెగంటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ చిత్రం 2019లో అనౌన్స్ చేశారు..2019 దసరా సందర్భంగా చిత్రం ఓపెనింగ్ జరిగింది. కాని కరోనా కారణంగా మధ్యలో ఆగింది. ఇక ఈ సమ్మర్ లో ఈ సినిమా రానుంది అని తెలుస్తోంది.