ఈ కరోనా వైరస్ తో దేశ వ్యాప్తంగా ఏడు నెలలుగా చిత్ర సీమలో ఉపాధి లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, మరీ ముఖ్యంగా సినిమాలు విడుదల ఆగిపోయాయి.. షూటింగులు నిలిచిపోయాయి, కొన్నిచిత్రాలు ఓటీటీలో విడుదల అవుతున్నాయి, ఇక వచ్చే రోజుల్లో కూడా ఓటీటీ వేదికగా అనేక సినిమాలు రానున్నాయి, చాలా మంది దర్శక నిర్మాతలు దీనిపై ఫోకస్ చేస్తున్నారు.
భారీ నిర్మాణం కాకుండా చిన్న సినిమాలు చేయాలి అని చాలా మంది ప్లాన్ వేస్తున్నారు, అయితే తాజాగా ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు భార్య తేజస్వీని సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి, ఆమె ఈ లాక్ డౌన్ కాలంలో ఓ అద్బుతమైన కథను రెడీ చేశారట, ఈ కధని సినిమాగా చేసి ఓటీటీ వేదికగా విడుదల చేయాలి అని భావిస్తున్నారు.
ఈ కథ దిల్ రాజుకి నచ్చింది ఈ స్టోరీ డవలప్ చేయడానికి నలుగురు టీమ్ ని ఆమెకి కేటాయించారు, అయితే ఆమె దర్శకత్వం వహిస్తారా లేదా రచనకే పరిమితం అవుతారా అనేది చూడాలి, మొత్తానికి మరో నెలలో దీనిపై ప్రకటన రానుంది, అయితే ఆరు నెలల వరకూ దియేటర్లకు జనం వచ్చే స్దితి లేదు అంటున్నారు చాలా మంది. , ఇక ప్రస్తుతం దిల్ రాజు ఎఫ్ 3 సినిమాపై బిజీగాఉన్నారు.